(తిమ్మాపూర్ మర్చి 16)
తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామనికి మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సిసి రోడ్ నిర్మాణానికి 5 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్ శనివారం మధ్యాహ్నం కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసారు..
ఈ కార్యక్రమంలో గొల్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు పింగిలి కృష్ణరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు కర్ర మణికంఠ, మల్లెతుల తిరుపతి,గడ్డం మహేందర్, దేవా రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమ్మేరా సుధాకర్ రెడ్డి, వేల్పుల గణపతి, సాయిల్ల బాలయ్య,తదితరులు పాల్గొన్నారు. గొల్లపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కి కృతజ్ఞతలు తెలుపారు..