నేరాలు

పేకాట ఆడుతున్న వ్యక్తులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్

91 Views

రామగుండం పోలీస్ కమీషనరేట్

పేకాట ఆడుతున్న 09 మంది వ్యక్తులను పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ టీమ్

???????? 1,61,,320/- రూపాయల నగదు, సెల్ ఫోన్ లు స్వాధీనం

రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్ (ఐజి) ఆదేశాల మేరకు ఈ రోజు టాస్క్ ఫోర్స్ సీఐ కృష్ణ రెడ్డి అధ్వర్యంలో ఎస్ఐ ప్రసాద్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జ్ లో కొందరు వ్యక్తులు రహస్యంగా డబ్బులు పందెం పెట్టుకుని పేకాట ఆడుతున్నారు అనే పక్కా సమాచారంతో పేకాట స్థావరం పై దాడి చేసి 09 జూదరులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుండి సెల్ ఫోన్లు 1,61,320/-నగదు, పేక ముక్కలు, 08 సెల్ ఫోన్ లు స్వాధీనపరచుకోవడం జరిగింది.

స్వాధీనపరుచుకున్న నగదు, సెల్ ఫోన్ లు, పేక ముక్కలను విచారణ కొరకు గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ వారికిీ అప్పగించడం జరిగింది .

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్