తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి విశ్వకర్మలో పై చిన్న చూపు చూడడం పై రాష్ట్ర విశ్వకర్మలు మండిపడుతున్నారు విశ్వకర్మలలో 80 శాతం మంది నిరుపేదరికంలో బతుకుతున్నారని వారికి రోజువారి కూలీ చేస్తే కానీ పూట గడవడం లేదని విశ్వకర్మలకు ఉపయోగించే పనిముట్లు కొనాలన్న లక్షల్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని ఆ డబ్బులు లేక అధిక వడ్డీలకు తీసుకువచ్చి పెట్టుబడి పెడితే మిగిలేది వడ్డీకి డబ్బులు ఇచ్చిన వారిని బ్రతికించడమే పనిగా ఉందని అంతేకాకుండా విశ్వకర్మల్లో అత్యధికంగా వడ్రంగి కంచరి కమ్మరి శిల్పి స్వర్ణకారుల్లో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారని స్వర్ణకారులు పెట్టుబడులు పెట్టాలంటే లక్షల్లో అంటే 20 నుంచి 30 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే కానీ వారికి పనులు దొరకడం లేదని విశ్వకర్మలైనటువంటి ఐదు కులాలకు పెట్టుబడులకు గాను ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిరుపేదలైనటువంటి విశ్వకర్మలకు 10 నుంచి 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి వారిని కాపాడవలసిందిగా రాష్ట్ర విశ్వకర్మలు ప్రభుత్వాన్ని కోరుచున్నారు పురాతన కాలంలో విశ్వకర్మ లేనిదే విశ్వంబు లేదురా అన్నటువంటి సామెత నిజానికి పురాతన కాలంలో ఇంట్లో వంట సామాగ్రి కావాలన్నా కంచరి అవసరపడేవాడు మరియు వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు తయారు చేయాలంటే వడ్రంగి మరియు కమ్మరి అవసరపడేవారు మనం మంచిగా వ్యవసాయంలో పంటలు పండించి పండుగలు చేసుకోవాలంటే గుడిలో అవసరం కాబట్టి గుడిని నిర్మించాలంటే శిల్పి అవసర పడేవాడు అదేవిధంగా శుభకార్యాలు కానీ పెళ్లిళ్లు కానీ చేసి భార్యాభర్తలు అని సాక్షాలు నిరూపించుకోవాలంటే స్వర్ణకారుడు తాళిబొట్టు మట్టెలు చేసి ఇచ్చేవాడు అలాంటి విశ్వకర్మ వృత్తులు ఈరోజు కార్పొరేట్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలు అంటగడుతున్నారు వారికి లైసెన్స్ లో తో పాటు అన్ని రకాల ఫైనాన్స్ లు కూడా ఆర్థికంగా ఆదుకుంటున్నారు అలా కాకుండా అతి పురాతనమైన విశ్వకర్మ గుత్తిదారులను కాపాడుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది పనులు లేక ఎంతోమంది విశ్వకర్మలు ఆత్మహత్యలు మరియు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కావున రాష్ట్ర ప్రభుత్వం చోరువ తీసుకొని విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మలు కోరుకుంటున్నారు విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ విశ్వకర్మలు హెచ్చరిస్తున్నారు
