Breaking News ప్రాంతీయం

సీఎం రేవంత్ రెడ్డికి ఘనంగా క్షీరాభిషేకం…

177 Views

ముస్తాబాద్, మార్చి13 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలోని రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి రెడ్డిసంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహంమవద్ద క్షీరాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా రెడ్డీలు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా గత ప్రభుత్వంలో ఎన్నో పోరాటాలు చేసిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోగా దారిద్యరేఖకు దిగువనున్న రెడ్డి కులస్తులను గుర్తించకపోవడం అత్యంత బాధాకరమన్నారు. కాంగ్రెస్  ప్రభుత్వం ఏర్పడగానే ఇచ్చిన హామీలనే కాకుండ అన్ని కులాలకు చెందిన వారిని కలుపుకొని పరిపాలన విధానాన్ని సాగిస్తూ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షీరాభిషేకంచేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కుంభాల మల్లారెడ్డి, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కుంభాల గోవర్ధన్ రెడ్డి, కోశాధికారి ఆగం రెడ్డి,మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, చల్లా దేవరెడ్డి, బొందుగల దేవరెడ్డి, మండలంలోని రెడ్డికుల బాంధవులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్