సిద్దిపేట జిల్లా గజ్వేల్: అక్టోబర్ 3
24/7 తెలుగు న్యూస్
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొని బండ మైలారం, తునికి బొల్లారం పారిశ్రామిక వాడలో 33/11 కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్లతోపాటు బహిలంపూర్, చిన్నతిమ్మాపూర్ గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేశారు.
గజ్వేల్ ప్రాంతంలో నెలకొన్న 50 ఏళ్ళ నీటి కష్టాన్ని కేసీఆర్ తొలగించారు, దేశంలో గజ్వేల్ రోల్ మోడల్ గా నిలచింది అన్నారు.





