*కలెక్టరేట్ ముట్టడి సందర్బంగా గన్నేరువరం బిజెపి నాయకులు ముందస్తు అరెస్ట్*
బీజెపి పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి సందర్బంగా బిజెపి నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది.
*బిజెపి నాయకుల డిమాండ్లు:-*
1) రైతులకు 100% ఉచిత మందులు
2) నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి
3) దళితులకు మూడెకరాల భూమి
4) కొత్త రేషన్ కార్డుల పంపిణీ
5) అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు
6) అర్హులైన వారందరికీ దళిత బంధు
అరెస్ట్ అయిన వారిలో బిజెపి మండల అధ్యక్షులు నగునూరి శంకర్, ఉపాధ్యక్షులు మునిగంటి సత్తయ్య, చిగురు సంజీవ్, సీనియర్ నాయకులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, బోయిని లక్ష్మణ్, కుర్ర హరీష్, పాల్గొన్నారు.
