రాజకీయం

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి

116 Views

– ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

(తిమ్మాపూర్, మార్చి 4)

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులు, కార్యకర్తల సమావేశాన్ని పార్టీ మండల అధ్యక్షులు మొరపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కొత్తపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ,హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి లు హాజరైయ్యరు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ…

రానున్న పార్లమెంట్ ఎన్నికల బరిలో కరీంనగర్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిని కూడా భారీ మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని కోరారు.

దేశంలో బిజెపి ప్రభుత్వo దేవుడి పేరుతో రాజకీయం చేస్తుందని,
శ్రీరాముని పేరు చెప్పి రాజకీయం చేస్తూ, ఓట్లు అడ గడం సిగ్గుచేటని ఎద్దేవ చేశారు. మోడీ ప్రభుత్వం బిజెపి ఏతర రాష్టాలలో మతాల మధ్య, ప్రజల మధ్య పార్టీల మధ్య సిచ్చులు పెట్టి, ఇతర పార్టీల ప్రభుత్వా లపై, నాయకుల పై కుట్రపూరితంగా వ్యవహరిస్తూ, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, మోదీ ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రభుత్వాలపై, నాయకులపై కేసులు పెడుతూ, దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తుందని అన్నారు.

దేశంలో అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలు శాంతియుత వాతావరణంలో జీవనం కొనసాగించడంతో పాటు దేశ ప్రజలు ఆర్థిక పురోభివృద్ధి సాధించాలన్న, పేద,సామాన్యులకు సంక్షేమ పథకా లు అందాలంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికె సాధ్యమవుతుందని హితవు పలికారు.

అనంతరం మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ ..

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు సిద్ధం కావాలని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పా టుకు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఎల్కపల్లి సంపత్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్.ఎల్ గౌడ్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు గోగురి నరసింహారెడ్డి, శ్రీగిరి రంగారావు, గోపు మల్లారెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, చింతల లక్ష్మా రెడ్డి, గంగిడి లక్ష్మారెడ్డి,పోలు రాముతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్