కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చింతల్ గ్రామంలో పిన్నోజు గంగాధర్ అనే స్వర్ణకారుడు చేతినిండా బంగారం పని లేక చికెన్ సెంటర్ నిర్వహించుకుంటున్నారు సిరిసిల్ల నుండి కామారెడ్డి వైపు వెళ్తున్న ఒక రిపోర్టర్ చింతల్ వద్ద గంగాధర్ కనిపియ్యగానే గంగాధర్ బాగున్నావా అని రిపోర్టర్ అడగగా అన్నా పనులు లేక చికెన్ సెంటర్ పెట్టుకున్నాను అన్నాడు ఎందుకు గంగాధర్ మీ స్వర్ణకారులలో ఏ కొంచెం బంగారం పనిచేసిన లక్షాధికారులు ఐతున్నారు అంతా మంచి బంగారం పని వదిలిపెట్టి (మీ ఆకు రాయి గట్టిగా ఉంటే అయిపాయే) నీవు చికెన్ కొట్టు పెట్టుకోవడం ఏంటి అని విలేకరి ప్రశ్నించగా అన్న మా స్వర్ణకారులలో పెట్టుబడిదారులు ఎక్కువైపోయారు మరియు కార్పొరేట్ జ్యువెలర్స్ కూడా ఎక్కువ అయిపోయాయి మా స్వర్ణకారులలో పెట్టుబడిదారులు ఉన్నన్ని రోజులు మా మధ్యతరగతి స్వర్ణకారుల బతుకులు ఇంతే అన్న మా స్వర్ణకారులలో పదివేల రూపాయలు ఇస్తే 10 లక్షల బంగారం పని చేసి పెడుతున్నారు కస్టమర్ 6 నెల వరకు ఆ డబ్బులు ఇచ్చిన పర్లేదు అంటున్నారు అలాంటి డబ్బులు నా వద్ద లేక నేను ఏ పట్టుబడి పెట్టలేక నాకు ఎవరు పని ఇవ్వడం లేదన్న ఊర్లో కూడా పూస్తే మట్టెలు కూడా ఇవ్వక నేను ఈరోజు చికెన్ సెంటర్ పెట్టుకుని జీవిస్తున్నాను దీనిని ప్రభుత్వం కానీ తగినటువంటి అధికారులు కానీ గుర్తించి పెట్టుబడిదారులను నియంత్రణ చేస్తే బాగుంటుంది అన్నా మేము స్వర్ణకార కులంలో పుట్టి కూడా స్వర్ణ వృత్తి చేయడానికి మాకు చేత్తునిండా డబ్బులు లేకపోవడమే కారణం దీనిని ప్రతి ఒక్క స్వర్ణకారుడు గమనించి పెట్టుబడిదారులను పెట్టుబడులు పెట్టకుండా చేస్తే మన స్వర్ణకారులను మనమే కాపాడుకోవడానికి వీలవుతుందన్న ఇంకా చాలామంది పెట్టుబడి లేక అప్పులు తీసుకువచ్చి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అన్న మొన్న రాజన్న సిరిసిల్లలో కూడా శ్రీపాద ఆంజనేయులు మరియు నిన్న వాళ్ళ భార్య కూడా ఈ స్వర్ణవృత్తి వల్ల అప్పుల పాలై చనిపోయారు అన్న వాళ్లకు పిల్లలతోటో లేదా వారి అధిక ఖర్చులతోటో కాదన్నా అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీకి వడ్డీ కట్టలేక అప్పుల పాలై చనిపోయారు అన్న అలాంటి పరిస్థితి రాకూడదని నేను చికెన్ సెంటర్ పెట్టుకొని జీవిస్తున్నాం అన్న అని విలేకరితో తన గోడు విన్నవించుకున్నాడు
