మంచిర్యాల జిల్లా
మంచిర్యాల అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిన కాంగ్రెస్, BRS పార్టీకి చెందిన 100 మంది యువకులు.
దండేపల్లి మండలం మాదాపూర్, మ్యాదరిపేట గ్రామాలకు చెందిన ముగ్గురు మాజీ వార్డు మెంబర్లు మరియు కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీల కార్యకర్తలు ఈరోజు బీజేపీ పార్టీలో చేరగా వారికీ బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి గారు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
మంచిర్యాల అసెంబ్లీ యువ నేత రఘునాథ్ తోనే అభివృద్ధి మరియు పేద ప్రజల సంక్షేమం సాధ్యం అయితదనే నమ్మకంతో ఈరోజు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది అని నాయకులు తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి యువ నాయకుడు రఘునాథ్ గెలుపునకు తాము అందరం కృషి చేస్తామని తెలిపారు.
