అబద్దాలతో రాజకీయం చేయడం తగదు,._*
*_రైతులు అసత్య ప్రచారాలు నమ్మొద్దు._*
*_మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్_*
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ సందర్శించిన మండల కాంగ్రెస్ నాయకులు సబ్ స్టేషన్ లోని లాగ్ బుక్కులు పరిశీలించి 24 గంటల విద్యుత్ ఎప్పటి నుండి వస్తుందో తెలుసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అమెరికాలో కరెంటు పై మాట్లాడినప్పటినుండే ఈ తెలంగాణ ప్రభుత్వం బయపడి ప్రజలు అసహ్యించుకుంటారని 24 గంటల కరెంటు గత నాలుగు రోజుల నుండి వస్తు0దని తెలియజేశారు ఈ సబ్ స్టేషన్ కింద ఉన్న గ్రామాల్లోని రైతులను ఎవరిని అడిగిన ఇప్పటివరకు 24 గంటలు ఉచిత0 ఇచ్చింది లేదు అన్ని అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించి కరెంటుపై నిజాలు తెలుసుకోవడం జరిగింది గత నాలుగు నెలల నుండి లాగ్ బుక్ పరిశీలన చేస్తే రైతులకు ఇస్తున్న కరెంటు ఏడు గంటల కరెంటు దాటలేదు 24 గంటల పై ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టిబొమ్మలు తగలబెట్టడం వారి నైతికతకు వదిలేస్తున్నాంపైగా తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ వర్తిస్తూ మంత్రి కేటీ రామారావు గారు 24 గంటల కరెంటు ఇస్తున్నామంటూ అసత్య ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలను వక్రీకరిస్తూ తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారుఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని ఈ దద్దమ్మ ప్రభుత్వం మరోసారి రైతుల మనోభావాలతోని గద్దెనెక్కాలని చూస్తుంది ఈ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది అని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ జె టోనీ, నర్సింగమ్ గౌడ్,లింగాల భూపతి,మచ్చ శ్రీనివాస్,గుగ్గిళ్ల శ్రీకాంత్,అరెపల్లి బాలు,గుగ్గిళ్ల భరత్,ఎడ్ల తిరుపతి,కంపెళ్లి శ్యామ్,చిలుక శ్రీనివాస్,యండి సలీం,ఖురేషి మాజిద్,తదితరులున్నారు.
