రామగుండం పోలీస్ కమీషనరెట్
తేది :28-02-2024
ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను సందర్శించిన పోలీస్ కమీషనర్ శ్రీ ఏం. శ్రీనివాస్ ఐపిఎస్.
నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అయినా ఇంటర్మీడియట్ పరీక్షల సందర్బంగా ఈరోజు గోదావరిఖని లోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాల లో ఉన్న పరీక్ష కేంద్రాల ను రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., గారు సందర్శించి పోలీస్ బందోబస్త్, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్ష నిర్వహణకు అధికారులు తీసుకొంటున్న చర్యలను పర్యవేక్షణ చేసి అధికారులకు పలు సూచనలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్స్, అన్ని మూసి వేయాలన్నారు. పరీక్షా సెంటర్స్ వద్ద ప్రజలు గుమిగూడ వద్దు అని ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించరాదు అన్నారు.






