కొమ్ము విజయ్ కుమార్
ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో కొమ్ము విజయ్ కు
ఘన సన్మానం
గజ్వేల్ , జులై 21
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యదర్శి రాచకొండ ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమ్ము విజయ్ కుమార్ ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రాచకొండ ప్రశాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలకంగా పనిచేస్తూ నిత్యం ప్రజా శ్రేయస్సు కోసం పరితపిస్తూ అందరి మన్ననలు పొందిన కొమ్ము విజయ్ కుమార్ జన్మదినం పురస్కరించుకొని వారిని ఎన్ఎస్ యుఐ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్ము విజయ్ కుమార్ మాట్లాడుతూ నామీద అభిమానంతో జన్మదిన వేడుకలు నిర్వహించిన ఎన్ ఎస్ యు ఐ నాయకులకు అలాగే జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నామీద అభిమానంతో జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల శ్రేయస్సు కోరే పార్టీ అని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేస్తూ రైతుల ఆదరణ పొందుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, బి ఆర్ ఎస్ పార్టీ కేవలం మాటలకే పరిమితమైందని, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ దశలవారీగా నెరవేరుస్తుందని ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ ప్రజల ఆదరణ పొందుతున్న కాంగ్రెస్ పార్టీ మీద ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు,మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి బురద జల్లె ప్రయత్నం చేస్తున్నారని కొండపాక మండలానికి చెందిన రైతు గట్టు పంచాయితి రాజకీయంగా మార్చడం తగదని అన్నారు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని సవాలు విసిరిన మాజీ మంత్రి హరీష్ రావు రాజనామాకు సిద్ధంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పంజాల రవి గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు అనిల్ రెడ్డి, మల్లేశం, బాబు నరేందర్ వెంకటేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
