ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 02 :
తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలన్నీ అభివృద్ధి పథంలో నడవడానికి మౌలిక సదుపాయాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కనిపిస్తున్నాడని, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అధ్యక్షులు పిల్లి రేణుక కిషన్ జెడ్పీటీసీ సభ్యులు చీటీ లక్ష్మణరావు అన్నారు,
ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో సి సి రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ 40 లక్షల రూపాయలు మంజూరు చేశారని వారు తెలిపారు,
. ఈ సందర్భంగా ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ , జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు లు సిసి రోడ్డుకు బుధవారం భూమి పూజ చేశారు,.
ఈ సందర్భంగా ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ ,జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం బాగుండాలని ఉద్దేశంతో మండలంలో సిసి రోడ్లకు మురికి కాలువలకు మండలంలోని సర్పంచులు ఎంపీటీసీలు అభివృద్ధి పనులకు నిధులు అడిగిన వారం రోజుల్లోనే అయిదున్నర కోట్ల రూపాయలు మంజూరు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు, జిల్లాలోనే ఎల్లారెడ్డిపేట మండలానికి ఎక్కువ నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు,
. ఈ కార్యక్రమంలో రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ ,సింగిల్ విండో అద్యక్షులు గుండారపు కృష్ణా రెడ్డి , వైస్ ప్రెసిడెంట్ కదిరే భాస్కర్ గౌడ్ ,ఎఎంసి మాజీ అద్యక్షులు అందె సుభాష్. గుళ్ళపెల్లి నర్సింహారెడ్డి , గ్రామ సర్పంచ్ కొత్తపెళ్లి వాణి నర్సింలు , ఎంపీటీసీ పద్మ దేవయ్య ,మండల కో ఆప్షన్ మెంబర్ మహామ్మద్ జభ్భర్ , టిఆర్ఎస్ పార్టీ నాయకులు తడకల దేవరాజు ,తడకల స్వామి , ఉపసర్పంచ్ ప్రవీణ్ రెడ్డి వార్డుమెంబర్లు , టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
