Breaking News

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-8 విజయవంతం.*

141 Views

జిల్లా లో 34 మంది బాల కార్మికుల విముక్తి.

-రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే .

రాజన్న సిరిసిల్ల: టిఎస్ లోకల్ వైబ్/

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, మరియు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆపరేషన్ స్మైల్ విజయవంతం కోసం టాస్క్ఫోర్స్ డిఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీస్ మరియు టాస్క్ ఫోర్స్ బృందం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,లేబర్ డిపార్ట్మెంట్,ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంటుఅధికారులతో జిల్లా లో టీమ్ లుగా ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని ఇందులో భాగంగా
ఈ సంవత్సరం జనవరి 1 నుండి 31 వరకు ఆపరేషన్ స్మైల్-8 కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగిందని ఇందులో 34మంది(బాలురు-26,బాలికలు-08) బాలకార్మికులను*గుర్తించి వారి యొక్క తల్లిదండ్రుల వద్దకు చేర్చడం జరిగిందని అన్నారు.
బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మానందరిపైనా ఉన్నదని, బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు.తరుచు బాలల చేత పనులు చేయిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.వీధి బాలలను చూసినప్పుడు, డయల్ 100 లేదా స్థానిక పోలీస్ వారికి సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.ఆపరేషన్ స్మైల్ విజయవంతం చేయడానికి సహకరించిన అన్ని శాఖల అధికారులను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అభినందించారు…

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7