హాట్ బకెట్ బిర్యానీ హోటల్ ప్రారంభించిన ప్రతాప్ రెడ్డి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పిడిచెడ్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన హాట్ బకెట్ బిర్యాని ఆదివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాట్ బకెట్ బిర్యానీ యజమానులు లక్ష్మణ్ నరేష్ ను అభినందించి గజ్వేల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ మంచి వ్యాపార కేంద్రంగా మారిందని సీఎం కేసీఆర్ ముందుచూపుతో గజ్వేల్ ముఖ చిత్రాన్ని మార్చారని మహానగరాలకు దీటుగా గజ్వేల్ ప్రజ్ఞపూర్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని యువత స్వయం ఉపాధి మార్గాల వైపు దృష్టి సారించాలని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ సహనాజ్ సమీర్,చందన రవీందర్, అత్తెల్లి.శ్రీనివాస్,గజ్వేల్ పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు నవాజ్ మీరా,ఇటిక్యాల సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్,కొండ పోచమ్మ డైరెక్టర్ ఆర్కే శ్రీనివాస్,బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
