Breaking News

కెటిఆర్ సూచనల మేరకు ఖైదీలను విడుదల చేసిన దుబాయ్ దేశం

153 Views

కెటిఆర్ సూచనల మేరకు
ఖైదీలను విడుదల చేసిన దుబాయ్ దేశం

ఐదుగురు ఖైదీలను
విడిపించడంలో ముఖ్య భూమిక పోషించిన రాదారపు సత్యం

ఎల్లారెడ్డిపేట మండలం ఫిబ్రవరి 22 :

మాజీ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రాధారపు సత్యం దుబాయ్ అడ్వకేట్లతో అనునిత్యం మాట్లాడుతూ బందీలుగా ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులను విడిపించడంలో ముఖ్య భూమిక పోషించారు ,
దుబాయిలో వివిధ కంపెనీల్లో పని చేస్తున్న కార్మికులకు చేదోడు వాదోడుగా ఉంటున్న రాధారపు సత్యం సామాజిక సేవలో ముందుండి ఆర్థిక సహాయాలను అందిస్తున్నాడు. నేపాల్ దేశానికి చెందిన ఓ వ్యక్తి హత్య కేసులో సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురికి 25 సంవత్సరాలు జైలు శిక్ష అక్కడి కోర్టు విధించగా గత కొన్నేళ్ల నుండి సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీమంత్రి కేటీఆర్ స్వయంగా పలు దపాలుగా దుబాయ్ వెళ్లి అక్కడి న్యాయవాదులతో మాట్లాడి బాధితుడికి స్వయంగా పరిహారం అందజేసి అక్కడే స్థిరపడిన రాధారపు సత్యమును కేసుకు సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు కనుక్కుంటూ అక్కడి సమాచారాన్ని అందించాలని కోరగా కేసుకు సంబంధించి అక్కడి న్యాయవాదులతో ఎప్పటికప్పుడు సత్యం మాట్లాడి ఖైదీలను విడిపించిన మాజీ మంత్రి కేటీఆర్ కు ప్రధాన భూమిక పోషించిన ఎల్లారెడ్డిపేట రాదరపు సత్యం కు వడ్డేర ఓబన్న హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గోగుల రమేష్ బ్లాక్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు సూర దేవరాజు , కాంగ్రెస్ పార్టీనాయకులు రొడ్డరాంచంద్రం , బండారి బాల్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు శివరాత్రి లక్ష్మణ్, సిరిసిల్ల టౌన్ అధ్యక్షుడు శివరాత్రి కనుకయ్య, జేఏసీ ప్రధాన కార్యదర్శి గండికోట రవి మహేష్, తిరుపతి కృతజ్ఞతలు తెలిపారు,
వారిని ఆర్థికంగా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వారు విజ్ఞప్తి చేశారు,

No Slide Found In Slider.

Poll not found