ఆధ్యాత్మికం

కన్నుల పండుగగా శ్రీ ఆంజనేయస్వామి మందిర పునః ప్రతిష్టా

100 Views

పాల్గొని స్వామి వారిని దర్శించుకొన్న ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు

ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 22 :

ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి మందిర పునః ప్రతిష్టా కార్యక్రమం గురువారం కన్నుల పండుగగా జరిగింది ,
బ్రహ్మశ్రీ రాచర్ల రఘురాం శర్మ, ఆలయ పూజారి వేణుగోపాల చారి ల ఆధ్వర్యంలో పురాతన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నుండి నూతనంగా నిర్మించిన ఆలయంలోనికి బ్రహ్మనోత్తములైన వేద పండితుల మంత్రోచ్చాల మధ్య ప్రతిష్టించారు,
ప్రతిష్ట మహోత్సవాన్ని తిలకించడానికి నారాయణపూర్ గ్రామస్తులు తండోపాతండాలుగా తరలివచ్చి స్వామి వారి ని కన్నులారా వీక్షించారు,
స్వామివారికి సీరా ప్రసాదాలు , తీపి వంటకాలు , పూలమాలలు కానుకలు సమర్పించుకొని కొబ్బరికాయలు కొట్టి మొక్కలు చెల్లించుకున్నారు ప్రత్యేకంగా
మహిళలు మంగళ హారతులతో స్వామి వారిని దర్శించుకొని తమ కోర్కెలు తీర్చాలనీ వేడుకున్నారు,
ప్రతిష్ట కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ , సిరిసిల్ల శాసన సభ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్రెడ్డి , ఎంపిపి పిల్లి రేణుక కిషన్, స్థానిక సర్పంచ్ నిమ్మ లక్ష్మి నారాయణరెడ్డి ఉపసర్పంచ్ సిరిపురం మహేందర్ , ఎంపీటీసీ సభ్యురాలు అపేరా సుల్తానా మజీద్ , మాజీ సర్పంచ్ దోమ్మాటి నరసయ్య , రామాలయ గుడి చైర్మన్ నరసయ్య , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి , కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి, నాయకులు రాజేందర్, శ్రీ నివాస్ రెడ్డి , బండారి బాల్ రెడ్డి, రొడ్డ రాంచంద్రం ,
బిఆర్ఎస్ పార్టీ , బిజెపి పార్టీ, బహుజన సమాజ్ పార్టీ స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు,
ఈ పత్రిష్ట మహోత్సవం అనంతరం ఆలయ అర్చకులు వేణుగోపాల చారి పాల్గొన్న భక్త కోటికి తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదం వితరణ చేశారు,

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7