(తిమ్మాపూర్ ఫిబ్రవరి )
తిమ్మాపూర్ మండలం రేణిగుంట గ్రామం లో రేణికుంట కాంగ్రెస్ పార్టి గ్రామశాఖ అధ్యక్షుడు ఎల్క రాజు, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు తమ్మవేణి రాములు యాదవ్ ఆధ్వర్యంలో రేణిగుంట టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన రేణికుంట క్రికెట్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ముగింపు పోటీలకు ముఖ్య అతిథిగా మానకొండూర్ శాసన సభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యి క్రీడా పోటీలో గెలుపొందిన, ఓడిపోయిన జట్లకు బహుమతులు అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..
క్రీడాల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోయిన వారు నిరాశచెందకుండా, మళ్లీ ప్రయత్నించి గెలుపొందాలన్నారు..
ఓటమి గెలుపుకు పునాదని అని అన్నారు. అలాగే గెలుపొందిన రేణికుంట జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు ..
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఈ సందర్భంగా యువకులకు సూచించారు..
ఈ కాంగ్రెస్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టి తిమ్మాపూర్ మండల అధ్యక్షులు మొరపల్లి రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ ఎల్ గౌడ్, జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్, గోగురి నరసింహారెడ్డి, ఎంపిటిసిలు బండా రమేష్, కొత్త తిరుపతిరెడ్డి, పొలం మల్లేష్ యాదవ్,తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్,బొంగాని రాజు గౌడ్, సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు…