24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 17)
కూచారం గ్రామంలో ఘనంగా జరిగిన బిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, గజ్వేల్ శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు ఘనంగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ శ్రీ వంటేరు ప్రతాప్ రెడ్డి, మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి ర్యాకల హేమలత శేఖర్ గౌడ్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కూచారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు సీఎంఆర్ ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి గ్రామస్తులకు మందులు అందజేశారు. ఈ సందర్భంగా కేసిఆర్ గారి 70వ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి పురం నవనీత రవి ముదిరాజ్, వైస్ ఎంపిపి విఠల్ రెడ్డ, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పురం మహేశ్ ముదిరాజ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వంగాల రమేష్ గౌడ్, రంగాయిపల్లి మాజీ సర్పంచ్ నాగభూషణం, కాళ్ళకల్ మాజీ ఉప సర్పంచ్ తుమ్మల రాజు యాదవ్, దండుపల్లి మాజీ ఉప సర్పంచ్ మహేందర్ గౌడ్, మండల, మండల కో ఆప్షన్ మెంబర్ మునావర్,బిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ వర్గంటి రాహుల్ రెడ్డి, మండల బిఆర్ఎస్ మైనార్టీ ప్రెసిడెంట్ ఇర్ఫాన్, కూచారం గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాసరి నరేష్ ముదిరాజ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నాయిని ఉదయ్ రంజన్ గౌడ్, వంగాల వీరేష్ గౌడ్, నాయిని నందు గౌడ్, వంగాల సాయి గౌడ్, అర్కల రమేష్ ముదిరాజ్, యావపురం క్రిష్ణ, వంగాల మనోజ్ గౌడ్, వడ్డె యాదగిరి, చాకలి సుధాకర్, కర్రె క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.





