24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 4)
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్ పుర్ మండల్ తిగుల్, నర్సాపూర్ గ్రామంలోని కొండపోచమ్మ అమ్మవారిని ఆదివారం మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ఒడి బియ్యం, చీరలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు వారిని సన్మానించారు.
