➡️ సరైనా వ్యక్తి నాయకుడైతే… ప్రజా సమస్యలు చట్ట సభల్లో వినిపిస్తాయి. నియోజకవర్గం, జిల్లా ప్రజల కష్టాలు.. ఈతి బాధలు.. ప్రభుత్వం ముందు పుట్టి.. వాటిని పరిష్కరించేందుకు క్రుషి చేస్తారు.. ఇందుకు మన నాయకుడు సాగరన్నే సాక్ష్యం. ఈ రోజు శాసనసభలో.. సాగరన్న చెప్పిన ప్రతిమాట.. మంచిర్యాల ప్రజల దశాబ్దాల కష్టాలను రాష్ట్ర ప్రజల ముందుంచింది. ప్రభుత్వం కూడా స్పందించి సమస్యల పరిష్కరిస్తామని చట్టసభలోనే హామీ ఇచ్చింది. దటీజ్ సాగరన్న.
➡️ సాగరన్న అసెంబ్లీలో లేవనెత్తిన అంశాలు.. ఆయన మాటల్లోనే..
➖ మా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు అన్ని రకాలుగా బాధితులమే.
➖ ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టి మా హాజీపూర్ మండలం నుంచి 12 గ్రామాలు, మొత్తంగా 15 గ్రామాలు ముుంపుకు గురయ్యాయి.
➖ మా రైతులు రైతు కూలీలుగా మారారు. మాకు ఒక్క చుక్క నీరు కూడా రాలేదు.
➖ దీనిపై నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిగారికి కలిసి మా బాధలు చెబితే.. గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు వల్ల కూడా మాకు ఎప్పుడూ రెండు టీఎంసీలకు మించి నీరు రాలేదు.
➖ ఇక దండేపల్లి మండలానికి వస్తే.. కడెం ప్రాజెక్టు టెయిల్ ఎండ్ బాధితులం. మాకు చుక్క నీరు రాదు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పాదయాత్ర చేస్తున్న సమయంలో మాకు మాట ఇచ్చారు. మరో రెండు లిఫ్టులు ఇస్తామని చెప్పారు. వాటిని త్వరగా కార్యరూపంలోకి తీసుకువస్తే మా మిగిలిన భూములకు నీళ్లు పారతాయి.
➖ కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యధిక బాధితులం కూడా మేమే. దురద్రుష్టవశాత్తు.. గత ప్రభుత్వం మాకు న్యాయం చేయలేదు.
➖ వర్షాకాలం వస్తే.. మా మంచిర్యాల పట్టణం ఎప్పుడు మునిగిపోతుందా అన్న భయం అందరిలో ఉంది.
➖ కరకట్టలు పటిష్టంగా నిర్మించి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి.
➖ ఆర్ అండ్ బీ మంత్రిని ఒక్కటే కోరుతున్నా.. మా దగ్గర చాలా ఫ్లై ఓవర్లు నిర్మాణంలో ఉన్నాయి. వాటిని త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నా.
➖ ఉమ్మడి రాష్ట్రంలో మా మంచిర్యాల మున్సిపాలిటికి 1995లో బెస్ట్ మున్సిపాలిటీ అవార్డు వచ్చింది. అలాగే 2001లో కూడా అవార్డు వచ్చింది. గత ప్రభుత్వం మా మున్సిపాలిటీని లాస్ట్ లో పెట్టింది. ఈ నేపథ్యంలో మా మున్సిపాలిటీ అభివ్రుద్దికి భారీగా నిధులు కేటాయించాలని కోరుతున్నా.
➖ మా మంచిర్యాల నియోజకవర్గం మొత్తం అయితే ముంపు ప్రాంతాలు.. లేకపోతే భూసేకరణలో భూములు కోల్పయిన బాధితులే.
➖ సింగరేణికి సంబంధించి శ్రీరామ్ పూర్ డివిజన్ లోని నస్ఫూర్ మున్సిపాలిటీలో మెజారిటీ ప్రజలు ఓ.సీ. బాధితులే. బాధితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకానీ, ఉద్యోగాలు కానీ.. ఏవీ లభించలేదు. వీరందరికీ న్యాయం చేయాలి.
➖ గత పదేళ్లుగా సింగరేణిలో లెటర్ల సంస్క్రుతి నడిచింది. స్థానికేతురులను తెచ్చి.. ఇక్కడి వాళ్లంటూ.. వారికి ఉద్యోగాలు అమ్ముకున్నారు.
➖ సింగరేణి భూ సేకరణలో భూములు కోల్పోయిన వారికి మొదటి ప్రాధాన్యత కింద ఉద్యోగాలు కల్పించాలి. అంతే కాకుండా వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో కూడా న్యాయం చేయాలి.
➖ సింగరేణికి బొగ్గును అత్యధికంగా అంటే 24 శాతం మా శ్రీరాంపూర్ డివిజన్ నుంచే వస్తుంది. మాకు బొగ్గు తప్ప ఇంకేం మిగల్లేదు. మా పైసలన్నీ తీసుకుపోయి ఎక్కడెక్కడో పెట్టుకున్నారు.
➖ ఈ నేపథ్యంలో వచ్చే మూడేళ్లు మా డబ్బులు మాకే ఖర్చు పెట్టాలి. అప్పుడే మా మున్సిపాలిటీలు, గ్రామాలు అభివ్రుద్ధి చెందుతాయి.
➖ మాకు నీళ్లు కావాలి.. నిధులు కావాలి.. మా నీళ్లు మాకు రాకుంటే.. ఎల్లంపల్లి నుంచి ఒక్క చుక్క నీటిని కూడా బయటకు పంపం.
➖ మంచిర్యాల పట్టణంలో లక్ష 30 వేల జనాభా, నస్ఫూర్ లో 95 వేల జనాభా.. మా దగ్గర ఒక్క స్మశానం కూడా లేదు. సింగరేణి డబ్బులతో నస్ఫూర్ లో మూడు స్మశానాలు నిర్మించాలి.
➡️ సీనియర్ సభ్యులైన ప్రేమ్ సాగర్ రావుగారు చెప్పిన అన్ని అంశాలను నోట్ చేసుకోవడం జరిగింది. ఇరిగేషన్ కు సంబంధించిన అంశాలను.. సంబంధిత శాఖామంత్రికి పంపుతాం. మిగిలిపోయిన సమస్యలపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇందులో ఎక్కడా రాజీ లేదు.
➖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
