హైదారాబాద్‌లో వినాయకుని నిమజ్జనంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ
హైదరాబాద్:సెప్టెంబర్ 25
హైదారాబాద్‌లో వినాయకుని నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు కీలక ఉత్తర్వులు ఇచ్చింది.
పీఓపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయరాదని తెలిపింది. పీవోపీ వినాయక విగ్రహాల నిమజ్జనంపై గతేడాది ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది.
కాగా తాజాగా పీవోపీ విగ్రహాలు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయరాదని హైకోర్టు సోమవారం తీర్పునిచ్చింది.
పీవోపీ విగ్రహాలు ప్రత్యేక కృత్తిమ కొలనుల్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. అయితే గతేడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నాయని హైకోర్టు తేల్చి చెప్పింది…
