ప్రాంతీయం

ప్రజాఘోష బిజెపి భరోసా కార్యక్రమం…

104 Views

ముస్తాబాద్ డిసెంబర్ 01, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జరగబోతున్న ప్రజాగోస బిజెపి భరోసా కార్యక్రమానికి సిరిసిల్ల ఇన్చార్జి గంగాడి మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శీలంరాజు, మెరుగు హనుమంత్ గౌడ్, మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, కస్తూరి కార్తీక్ రెడ్డి, ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద విగ్రహంవద్ద బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ చేతులమీదుగా జెండా ఆవిష్కరించారు. అనంతరం ముస్తాబాద్లో పలు గ్రామాల గురించి చర్చించి కేటీఆర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఎలాంటి అభివృద్ధి నోచుకోని దుస్థితి చేరిందని పలు అంశాలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు కరెంట్ల రమేష్ రెడ్డి, కార్యదర్శి సంజీవ్, ప్రధాన కార్యదర్శి లు కోలా కృష్ణ, క్రాంతి, జనార్ధన్, మహేందర్, వరి వెంకటేష్, తిరుపతి, గిరిధర్ రెడ్డి, శ్రీనివాసరావు, తాండ్ర రాంగోపాల్, ఉప సర్పంచ్ తిరుపతి, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్