6 గ్యారంటిల పై స్పష్టత లేని రాష్ట్ర బడ్జెట్ – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి.
నేడు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కేవలం లోక్ సభ ఎన్నికలు దృష్టిలో పెట్టకొని బడ్జెట్ రూపకల్పన చేసినట్టుగా ఉందని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నపటికీ రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టడానికి ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టినట్టుగా ఉందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర తో పాటు ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టితే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన బడ్జెట్ లో మాత్రం ఆయ పథకాలకు అవసరమైన నిధులు కేటాయించలేదు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారెంటిల అమలు పై ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదు. 6 గ్యారింటిల అమలు కోసం నిధులు ఎలా సమకూర్చాలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదని అన్నారు.
