24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 9)
సిద్దిపేట జిల్లా:
ప్రభుత్వ అనుమతి లేకుండా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ గ్రామ శివారు రాజీవ్ రహదారి పక్కన , వర్గల్ మండలం గౌరారం గ్రామ శివారు రాజీవ్ రహదారి పక్కన అక్రమంగా డంపు చేసిన ఇసుకను సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. అక్రమ ఇసుక డంపులను స్వాధీనం చేసుకుని గజ్వేల్ గౌరారం పోలీసులకు అప్పగించాగా, ఆయా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
