24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 4)
తెలంగాణ జన సమితిలో సిద్దిపేట జిల్లా నుండి తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాదులో పార్టీ ఆఫీసులో పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలో వివిధ పార్టీ నాయకులు చేరడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఇక ముందు కూడా చేరికలు జరుగుతాయి మరియు పార్టీని బలోపేతం చేయాలని టీజేఎస్ జిల్లా అధ్యక్షులు నీరుడి స్వామి అన్నారు.యువజన విభాగ అధ్యక్షులు కీసర స్వామి మాట్లాడుతూ పార్టీలో చేరినందుకు ధన్యవాదాలు చెప్పారు ఇకముందు కూడా పార్టీ కోసం కష్టపడి పని చేయాలని వివిధ మండలాలన్నీ తిరిగి కమిటీలను వేసి జిల్లా వ్యాప్తంగా తిరిగి పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ టీజేఏసీ పార్టీ నాయకులు ముందు వరుసలో ఉంటారు అనీ చెప్పారు ఎక్కడ ఏది జరిగిన ప్రశ్నించే తత్వం ఉంటుంది. ప్రభుత్వం నుంచి వచ్చే స్కీములని ప్రజల యెక్క ఇబ్బందులను ప్రభుత్వాo దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ నాయకులు శ్రీనివాస్. యాదగిరి. శ్రీనివాస్. పప్పీ. స్వామి. ఆమోద్. తదితరులు పాల్గొన్నారు
