ఎల్లారెడ్డిపేట నవంబర్ 02 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక లను శ్రీ వేణుగోపాల్ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ నంది కిషన్ ఆలయ పూజారి నవీన్ చారి కమిటీ సభ్యులతో కలిసి గురువారం ఆవిష్కరించారు, స్వస్తిశ్రీ శుభకృత్ నామ సంవత్సర కార్తిక శుద్ధ ఏకాదశి తేదీ 04 -11 -2022 శుక్రవారం నుండి కార్తీక శుక్ల పాడ్యమి తేదీ 10 -11 -2022 గురువారం వరకు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలు జరుగుతాయి, 06-11-22 ఆదివారం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి కళ్యాణ ఉత్సవానికి ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని అశ్విని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి ,సత్యనారాయణ స్వామి ముత్యాల తలంబ్రాలను నివేదిస్తారు అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేశారని ఆలయ కమిటీ అధ్యక్షులు నంది కిషన్ తెలిపారు , అదేవిధంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలకు మొత్తం పుష్పాలను , మాలలను రథానికి పుష్పాల అలంకరణ దుబాయి ఎన్ ఆర్ ఐ రాదారపు .సత్యం పద్మ లు సమకూర్చుతున్నారని కిషన్ చెప్పారు , అదేవిధంగా బ్రహ్మోత్సవాలకు ఆలయ నిర్మాణానికి వేరు వేరుగా ఆర్థీక వనరులు అందజేస్తున్న దాతల పేర్లను ప్లేక్సీ లో ముద్రించాలని కమీటీ తీర్మానించింది , అదేవిధంగా బ్రహ్మోత్సవాలు పూర్తి అయ్యేవరకు కమీటీ సభ్యులు తమ సేవలను అందించాలని నిర్ణయించారు , ఈ సమావేశానికి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వివిధ కుల సంఘాల పెద్దలు హాజరై బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక లను ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు,
