ఎల్లారెడ్డిపేట మండలం: టి ఎస్ లోకల్ వైబ్ జనవరి 31:
ఎల్లారెడ్డిపేట మండలం వదిలి గ్రామంలో సోమవారం రోజున బీజేవైఎం మండల శాఖ ఆధ్వర్యంలో పదిర గ్రామంలో నూతన బీజేవైఎం గ్రామశాఖను ఎన్నుకోవడం జరిగింది..ఈ కార్యక్రమనికి మండల బీజేపీ అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి అలాగే సీనియర్ నాయకులు ముద్దుల బుగ్గారెడ్డి, రామచంద్ర రెడ్డి, ఎస్సి మోర్చా అధ్యక్షులు రవి ముఖ్య అతిధులుగా హాజరు కావడం జరిగింది.. ఈ సమావేశంలో పదిర గ్రామ బీజేవైఎం అధ్యక్షునిగా నవీన్, ఉపాధ్యక్షుడిగా మహేష్, సేక్రటరిగా సాయి లను ఎన్నుకోవడం జరిగింది. అనంతరం మండల నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో టీఆరెస్ పార్టీని భూస్థాపితం చేసే దిశగా ప్రతి ఒక్క యువకుడు పనిచేయాలని, టీఆరెస్ పార్టీ అరాచకాలను ఇచ్చిన హామీలను ఇవ్వకపోవడాన్ని ఎండకడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చే విదంగా పనిచేయాలన్నారు..ప్రతి గ్రామంలో చాలా మంది యువకులు పార్టీ సిద్ధాంతాలు నచ్చి బీజేపీలో జాయిన్ అవుతున్నారని పేర్కొన్నారు..టీఆరెస్ ప్రభుత్వం కేవలం పేరుకే ఉందని ఇంతవరకు మండలంలో చేయవలసిన పనుల ఎక్కడికక్కడే నిలిచిపోయాయని అన్నారు..జిల్లా మంత్రిగా ఉన్న కేటీఆర్ మండలానికి ఎం చేసారో చెప్పాలని నిలదీశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షులు మెరుగు జితేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు దయాకర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ కార్యదర్శి జలంధర్ కార్యవర్గ సభ్యులు వెంకటేష్, భాస్కర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….





