ప్రాంతీయం

పదవి కాలం పూర్తయిన పాలకులకు సన్మానం…

247 Views

ముస్తాబాద్, ఫిబ్రవరి 1 (24/7న్యూస్ ప్రతినిధి) మోహినికుంట గ్రామంలో ఐదేళ్ల పదవి బాధ్యతలు సంపూర్ణంగా చేపట్టిన సందర్భంగా గ్రామ పంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ ఉప సర్పంచ్ నరాయనోజు సంధ్య వీరిరువురికి శాలువాతో సత్కరించారు. వారితో పాటు వార్డు మెంబర్లు నరాయనోజు వనజ, జంపెల్లి ఈశ్వరి కుందేన రాజేశ్వరి, రాజాం లక్ష్మి, శీలం సంతోష, పల్లాటి భూదేవి మెరుగు పుష్పలను సన్మానించారు. ప్యాక్స్ వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు నరాయనోజు సతీష్, పార్టీ మండల ఉప అధ్యక్షుడు కల్వకుంట్ల శ్రీనివాస్ రావు, గ్రామ పెద్దల లింగారెడ్డిలను, సన్మానించారు. వంద మందికి పైగా భోజనం వసతి ఏర్పాటుచేసి కీలకంగా పోషించిన వారిలో కల్వకుంట్ల శ్రీనివాసరావు, కల్వకుంట్ల గోపాల్ రావు, మేరుగు రాజేశంగౌడ్ లు ఉన్నారు‌. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పాలకులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *