ఆధ్యాత్మికం

శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట పండగల జరుపుకోవాలని

190 Views

అయోధ్య రామ మందిరంలో రేపు శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని హిందువులు అందరూ పండుగలా జరుపుకోవాలి – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి.

అయోధ్య రామ మందిరంలో రేపు శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట జరగనున్న సందర్భంగా ఆలయాలు అన్ని శిద్ది చేయాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు బీజేపీ నాయకులు ఈరోజు మంచిర్యాల పట్టణంలోని గర్మిల్ల హనుమాన్ దేవాలయంలో స్వచ్ తీర్థ కార్యక్రమంలో పాల్గొని దేవాలయాన్ని శుద్ది చేయడం జరిగింది.

ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ వందల ఏండ్ల హిందువుల కళ అయోధ్య రామ మందిరం సాకారం అవుతున్న వేళ ప్రతి ఒక్క హిందువు పండుగలా జరుపుకోవాలని అన్నారు. రేపు అయోధ్య రామ మందిరంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ సమీప గుడిలో, ఇంట్లో భజనలు చేయాలని అన్నారు.

అనంతరం రేపు మధ్యాహ్నం మంచిర్యాల పట్టణంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టే శోభ యాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. అదే విధంగా సాయంత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో దీపాలు వెలిగించి దీపావళి పండుగలాగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రజనిష్ జైన్, ఆకుల అశోక్ వర్ధన్, బోయిని హారి కృష్ణ, రంగ శ్రీశైలం, బియ్యాల సతీష్ రావు, కంకణాలు సతీష్, ముదాం మల్లేష్, మెరేడికొండ శ్రీనివాస్, శివ శంకర్, తిరుమల, నాగుల రాజన్న, బల్ల రమేష్, గదార్ల మల్లేష్, రెడ్డిమల్ల అశోక్, బోయిని దేవేందర్, రాకేష్ రేన్వ, బింగి సత్యనారయణ, చిరంజీవి, మేన సూరి మరియు తతిదరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *