ప్రాంతీయం

కేతనపల్లిలో హై టెన్షన్, ఆడవారిపై అసభ్యకరంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బిఎస్పీ పార్టీ డిమాండ్

9 Views

కేతనపల్లిలో హై టెన్షన్ ఆడవారిపై అసభ్యకరంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  బీఎస్పీ పార్టీ డిమాండ్.

మంచిర్యాల జిల్లా, కేతనపల్లి మున్సిపాలిటీ.

మంచిర్యాల జిల్లా, కేతనపల్లి మున్సిపాలిటీలో  ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఆడవారి పైన కొంతమంది వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించారని తెలియజే జరిగింది. మున్సిపాలిటీలో ఉన్న సీసీ కెమెరాను పరిశీలించి కఠిన చర్యలు తీసుకొని వారిని వెంటనే అరెస్టు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ జరుగుతున్న హై టెన్షన్ వాతావరణ వల్ల రామకృష్ణాపూర్ ప్రజలు భయభ్రాంతులకి గురవుతున్నారు. ఏ సమయంలో ఏం జరుగుతుంది అన్ని ప్రజాస్వామ్య రాజ్యమని ప్రజలు ఇచ్చిన తీర్పుకి అందరు కట్టుబడి ఉండాలని మంత్రి వివేక్ వెంకటస్వామి  చదువుకున్న మేధావి ఇండస్ట్రియల్ లిస్టు ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా పనిచేస్తున్న మీరు ఎప్పుడు కింది రాజకీయాలు చేయలేదు అలాంటి మీరు దయచేసి పక్కన ఉన్నవారి మాటలు నమ్మకుండా తెలంగాణ రాష్ట్రం దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వ మేయర్లు మున్సిపల్ చైర్మన్  ప్రమాణస్వీకారం చేసినారు ఒక్క సీటు కోసం బాల్క సుమన్ మరియు వివేక్ స్వామి పంతానికి పోయి ప్రజలు మీ మీద పెట్టుకున్నా నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దని నిన్న జరిగిన దాడిలో అమాయక ప్రజలు మరియు ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర గాయాలపై అయినారు ఇప్పటికైనా దయచేసి ఇది ప్రజాస్వామ్య రాజ్యమని మర్చిపోవద్దు. అదేవిధంగా ఎందుకు ప్రభుత్వం వారిని ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకుంటున్నారు ఒక్క మున్సిపల్ సీట్ల కోసం ఎన్నడూ లేని విధంగా రామకృష్ణాపూర్ చరిత్రలో ఇది తొలిసారి ఈ విధంగా జరగడం అటు ప్రజలకు రాజకీయ నాయకులకు మంచిది కాదని ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఇరు వర్గాలు కట్టుబడి ఉండాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ కాదశి రవీందర్, జిల్లా ఇంచార్జ్ దాగం శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్రప్రసాద్, కేతనపల్లి పట్టణ అధ్యక్షులు బొల్లి నరేష్, మందమర్రి పట్టణ అధ్యక్షులు గాజుల శంకర్, మండల అధ్యక్షులు, మతీన్ కాన్, తిరుపతి, రవి ,రాజు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *