ద్విచక్ర వాహనాన్ని డీ కొట్టిన కారు
:మహిళ కు తీవ్ర గాయాలు
:3 నెలల పసికందు , మరోకరికి స్వల్ప గాయాలు
ఎల్లారెడ్డిపేట మండల ప్రతినిధి
ఎల్లారెడ్డిపేట మండలం హారిదాస్ నగర్ బస్ స్టాఫ్ సమీపంలో శనివారం మాద్యాహ్నం 2-00 గంటల ప్రాంతంలో వీర్నపల్లి మండలానికి చెందిన సురేష్, పద్మ అనే దంపతులు సిరిసిల్ల లో పిల్లల ఆసుపత్రి కి మూడు నెలల బాబు ను తీసుకెళ్ళి వైద్యం చేయించుకొని స్వగ్రామానికి తిరిగి వస్తున్న క్రమంలో నిజామాబాద్ జిల్లా కు చెందిన సిద్దిపేట ఎఆర్ ఎఎస్ఐ జిల్లా లక్ష్మి నర్సాగౌడ్ ప్రయాణి స్తు న్న కారుతో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహానాన్ని డీకొన్నాడు.ఈ సంఘటనలో పద్మ కు కుడి కాలు విరిగింది మోకాలు చిప్ప పగిలి సంఘటన స్థలంలో రోడ్డు పై పడిపోయింది, ఆమే భర్త సురేష్ స్వల్పంగా గాయపడ్డాడు.మూడు నెలల బాలుడు కూడా గాయపడ్డాడు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు.
నిజామాబాద్ జిల్లా కు చెందిన సిద్దిపేట ఎఆర్ ఎఎస్ఐ జిల్లా లక్ష్మి నర్సాగౌడ్ తన కుమారుడి వివాహం కోసం పెళ్ళి పత్రికలు పంచే క్రమంలో సిద్దిపేట కు వెళ్ళి అదికారులకు లీవ్ కోసం కారులో వెళ్ళుతుండగా ఈ సంఘటన జరిగింది , కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామాకాంత్ తెలిపారు.
