నేరాలు

రామగుండం కమిషనరేట్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు

246 Views

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలదృష్ట్యా, ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ప్రశాంతమైన వాతావరణం లో ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికలు జరిగేందుకు ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా, ఎన్నికలను ప్రభావితం చేసే, ప్రజలను ప్రలోభాలకు గురిచేసే మద్యం, డబ్బు, వస్తువుల అక్రమ రవాణాకు అవకాశం లేకుండా శాంతియుతంగా జరిగే విధంగా కట్టుదిట్టమైన ముందస్తు భద్రత చర్యలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోనీ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో ఎన్నికల సందర్బంగా అనుమానితులు డబ్బు తరిలించే అవకాశం ఉండటం తో బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, లాడ్జ్ లను మరియు వాహనాలను ఆకస్మికంగా తనిఖీ లు విస్తృతస్థాయిలో వాహన తనిఖీలు చేపడుతున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి) తెలిపారు.

ఎన్నికలు ముగిసే వరకు ఈ ఆకస్మిక తనిఖీ లు కొనసాగుతాయన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించి అక్రమ రవాణాకు పాల్పడిన, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నియమాలు అతిక్రమించిన ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడడమే ముఖ్య ఉద్దేశం అన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *