– కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్
(తిమ్మాపూర్ జనవరి 25)
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నమో నవ యువ ఓటర్ల సమ్మేళననికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపి బండి సంజయ్ కుమార్..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
ఓటు హక్కుతో మీ తలరాతతోపాటు దేశ భవిష్యత్తును కూడా మార్చుకునే సత్తా ఉందన్నారు. కానీ నేటి యువత ఆశించిన స్థాయిలో ఓటు హక్కు నమోదు చేసుకోకపోవడం బాధాకరమన్నారు.
నవ యువత ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.10వ స్థానంలో ఉన్న భారత్ ను 5వ స్థానానికి చేర్చిన మోదీని మళ్లీ ప్రధానిగా ఎన్నుకోవాల్సిన అవసరం యువతపై ఉందన్నారు.
మోదీ మళ్లీ ప్రధాని అయితే భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ గా మారడం తథ్యమన్నారు.ప్రతి ఒక్కరు ఓటు విలువ తెలుసుకొని వచ్చే ఎన్నికల్లో మీ దమ్మెందో చూపించాలని యువతకు దిశా నిర్దేశం చేశారు…
గల్లీలో ఎవరున్నా సరే, ఢిల్లీలో ప్రధాన మంత్రి గా మోడీ ఉండాలని మోడీ లేని భారతదేశ ఊహించుకోలేమని అన్నారు.యావత్ ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుందన్నారు…
ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య కళాశాల చైర్మన్ రమేష్ రెడ్డి, బీజేవైఎం నాయకులు, తదితరులు పాల్గొన్నారు..