24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 24)
సిద్దిపేట జిల్లా
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటురు గ్రామానికి చెందిన ఎన్నెల్లి శేఖర్ (28) జబ్బాపూర్ దగ్గర మట్టికుప్పకు బైకు ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు .మృతునికి భార్య,ముగ్గురు పిల్లలు ఉన్నారు.మంగళవారం రాత్రి మైలారం నుంచి పాల క్యాన్లతో ద్విచక్ర వాహనం మీద ఇంటికి వెళ్తుండగా చీకట్లో మట్టికుప్పను ఢీకొని మృతి చెందాడని భేగంపేట ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపారు.
