ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు.
నలుగురికీ ఉపయోగపడే పనులు ఆయనకే సొంతం…
(తిమ్మాపూర్ జనవరి 23)
పార్టీ కోసం పనిచేసే సత్తువ అందరికి ఉండదు.బిఆర్ఎస్ పార్టీ కోసం రావుల రమేష్ అహర్నిశలు కృషి చేయడం అభినందనీయం.
ప్రజల కష్టనష్టాలు తెలిసున్న వ్యక్తి నిరంతర ప్రజా సేవకుడు,నాయకుడు అనే వాడు ఎప్పుడు ప్రజలతో మమేకం కావాలి అంటూ ప్రజల కష్ట సుఖాల్లో..పాలు పంచుకుంటు మానకొండూరు నియోజక వర్గంలోని తిమ్మాపూర్ మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నుస్తులాపుర్ సర్పంచ్ గా రావుల రమేష్ ఫోన్ చేస్తే చాలు నేరుగా స్పందించి ముందు కు వచ్చి సహాయం చేయడం ఆయనకే సాధ్యం. అడిగిన ప్రతి పని సాధ్యం కాకపోవచ్చు కానీ,తన మాట సాయం చేసి నేనున్నానని భరోసా ఇచ్చి,ఆపదలో ఉన్నవారికి కొండంత అండ ఇస్తాడు.అందుకే ఆయన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు.
ఒక కమిట్మెంట్, ఒక స్పూర్తి, ఒక సిద్దాంతం ఉన్న నాయకుడు మహోన్నత వ్యక్తి రావుల రమేష్ తిమ్మాపూర్ మండలం లో అందరికి అందుబాటులో ఉంటూ, పండగలకు, పబ్బాలకు, సావులకు, దినాలకు ఇలా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ నేనున్న అంటూ భరోసాని ఇస్తున్నాడు.దానికితోడు స్వతహాగా నుస్తూలపూర్ గ్రామంలో ఆడపిల్ల పుడితే వారి పేరు మీద 5016/- పిక్స్ డ్
డిపాజిట్ చేసి నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నారు. చాలా మంది ఒక పొజిషన్ రాగానే కొమ్ములోచ్చినట్లుచేస్తూ, హైదరాబాద్ కు మకాం మార్చి ప్రజలను విస్మరిస్తున్నారు.
కానీ రావుల రమేష్ ఎల్లప్పుడు పార్టీ, ప్రజాసేవపై దృష్టి పెడతారు. రావుల రమేష్ నుస్తులాపూర్ గ్రామ సర్పంచ్ గా బీఆర్ఎస్ పార్టీ తిమ్మాపూర్ మండల అధ్యక్షుడిగా పని చేసి పార్టీలో అందరివాడిగా ఉంటూ ప్రజలలో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటు, వారికి అండగా నిలుస్తారనే అభిప్రాయం నాయకులలో కార్యకర్తలో ఉంది. ఎవరైనా ఆపద ఉందని వస్తే వెంటనే స్పందిస్తూ, పరిష్కరించేలా చర్యలు తీసుకుంటూ ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్నారు..
అందరి చూపు అతని వైపే…
కరీంనగర్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవిని రావుల రమేష్ కు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టి కోసం, కార్యకర్తల కోసం అహర్నిశలు శ్రమించే రావుల రమేష్ కు ఇస్తేనే బాగుంటుందని ఆపార్టీలో ఉన్న లీడర్స్ చర్చించుకుంటున్నారు.
బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి రేసులో పలువురు పోటీపడుతున్నప్పటికి ఇప్పుడు పార్టీ కోసం కష్టపడే నేతలలో ఎవరో ఒక్కరికి పదవి కట్టబెట్టాలని అధిష్టానం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మానకొండూరు నియోజకవర్గము లోని తిమ్మాపూర్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేష్ కు కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉండటం కలిసొచ్చే అంశంగా పార్టీ శ్రేణులు, అభిమానులు అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ జిల్లా అధ్యక్ష పదవిని జిల్లాలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో సూపరిచితమై కార్యకర్తలతో మమేకమై పనిచేసే రావుల రమేష్ కు వస్తే పార్టీ బలోపేతానికి కృషిచేస్తూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అందరని ఏకతాటిపైకి తీసుకువచ్చి నేతలను కార్యకర్తలను కలుపుకొని పనిచేస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.