శాంతి భద్రతల సంరక్షణలో తెలంగాణ నెంబర్ వన్: కేటీఆర్
జగిత్యాల జిల్లా:అక్టోబర్ 03
శాంతి భద్రతల సంరక్షణలో దేశానికే ఆదర్శవంతంగా తెలంగాణ పోలీసింగ్ నిలుస్తుందని, సాంకేతికతను వినియోగించుకోవడంలో, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందంజలో ఉన్నారని, అదే విధంగా పోలీసు సంక్షేమ చర్యలో భాగంగా దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి మంగళవారం ప్రారంభించారు.
అందులో భాగంగా మొదట పోలీస్ స్వీకరించిన మహమూద్ అలీ అనంతరం శిలాఫలకంను ప్రారంభించి, ఆఫీస్ రిబ్బన్ కట్ చేసి అత్యాధునికంగా నూతన సాంకేతికతతో నిర్మించిన నూతన జిల్లా పోలీస్ కార్యాలయంను వేద మంత్రాల మధ్య ప్రారంభోత్సవం చేశారు.
