నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేష్
(తిమ్మాపూర్ జనవరి 22)
శ్రీరాముడు ధర్మానికి మార్గదర్శకుడు అని అందుకే అతడిని పురుషోత్తముడిగా కొలుస్తారని నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేష్ తెలిపారు.అయోధ్యలోని రామ జన్మభూమిలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేష్ ఆధ్వర్యంలో సోమవారం నుస్తులాపూర్ భవానీ శంకర సహిత వీరాంజనేయ స్వామి ఆలయంలో అయోధ్య రామాలయ అక్షింతలతో అర్చకులు మేళతాలలతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సీతా సమేత శ్రీరామ, లక్ష్మణ,ఆంజనేయ స్వాముల
ఉత్సవ మూర్తులకు ఆలయంలో అర్చకులు కిరణ్ శర్మ పంచామృతాలతో అభిషేకించి రామనామ జపంతో అంగరంగవైభవంగా ప్రత్యేకంగా పూజలు చేసి భక్తులకు అక్షింతలను అందజేశారు.
ఈ సందర్భంగా రావుల రమేశ్
మాట్లాడుతూ..
రామనామాన్ని జపించిన వారు పాపవిముక్తులవుతారని, కష్టాల బారిన పడకుండా ఉంటారని చెప్పారు.
తల్లిదండ్రుల పట్ల విదేయత కలిగి ఉండటమే కాకుండా సోదరుల పట్ల సోదర భావాన్ని పిల్లల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉండాలని సూచించారు.
రాముడు సకల గుణాలు కల్గినవాడని, అందరి వ్యక్తులలో ప్రథమ స్థానంలో ఉంటాడని అందుకే అతడిని పురుషోత్తముడిగా కొలుస్తారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బెతి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ చైర్మన్ నూనె సురేష్, వంగల శ్రీనివాస్ రెడ్డి గట్టయ్య, కనకయ్య, బేతి తిరుపతి రెడ్డి, దుర్శట్టి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..




