అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో బగలాముఖీ అమ్మవారికి విశేషపూజలు
పీతవర్ణ పుష్పాలు, పీతవర్ణ వస్త్రాలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ
అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి దర్శనభాగ్యం పొందిన భక్తులు
జనవరి 16
మెదక్ జిల్లా
మెదక్ జిల్లా శివంపేటలోప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా, దేశంలోనే మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో బగలాముఖీ ట్రస్ట్ సహకారంతో, అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర ఆధ్వర్యంలో అనతికాలంలోనే నిర్మితమైన అత్యంత శక్తిపీఠాలలో ఒకటైన శక్తిపీఠం,తనను నమ్మిన భక్తులకు ఎలాంటి ప్రతిభంధకాలు ఎదురుకాకుండా, తన భక్తులకున్న ప్రతిభంధకాలను తొలగించే అమ్మవారు శివ్వంపేట శ్రీబగలాముఖీ శక్తిపీఠంలో అమ్మవారికి ప్రీతిపాత్రమైన మంగళవారం అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుండే అమ్మవారికి విశేషపూజలు, మహాపూజలు నిర్వహించడం జరిగినది. అమ్మవారిని పీతవర్ణ వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించి, అమ్మవారికి పీతవర్ణ పుష్పాలు, పలు రకాల ఫలాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది.
బగలాముఖీ అమ్మవారికి ప్రీతిపాత్రమైన పసుపుతో హరిద్రార్చన నిర్వహించడమే కాకుండా అమ్మవారికి శ్రీసూక్త, శతసహస్ర నామార్చనలతో పాటు అభిషేకం, మంగళహారతి, మంత్రపుష్పం కార్యక్రమాలను శ్రద్దలతో నిర్వహించడం జరిగినది. కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి భక్తులు,అమ్మవారి భక్తులు విచ్చేసి బగలాముఖీ అమ్మవారిని దర్శనం చేసుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కలు చెల్లించుకున్నారు. మహిళా భక్తులు అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించి మొక్కలు చెల్లించుకోవడం జరిగినది.
అమ్మవారి భక్తులకు అమ్మవారి ఉపాసకులు వెంకటేశ్వర శర్మ చేతులమీదుగా తీర్థప్రసాదాలను అందజేయడం జరిగినది.అమ్మవారి మహాపూజలలో శక్తిపీఠం వేదపండితులు సంతోష్ శర్మ, దంతాన్ పల్లి సర్పంచ్ కన్నారం దుర్గేష్, గూడూరు ఉపసర్పంచ్ కుమ్మరి జ్యోతి చరణ్, ఆత్మకమిటీ డైరెక్టర్ వంజరి కొండల్, బ్రహ్మచారి,కిషన్, వందల సంఖ్యలో అమ్మవారి భక్తులు, తదితరులు పాల్గొన్నారు.





