భవన నిర్మాణ కార్మికుల కోసం ఆన్లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలి
అదనపు వసూలు చేస్తున్న మీసేవ సెంటర్ల పై చర్యలు తీసుకోవాలి
జనవరి 16
కొమురం భీం జిల్లా
భవన నిర్మాణ కార్మికుల జాబ్ కార్డ్ కోసం ప్రతి మండల కేంద్రంలో ఆన్లైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని మంగళవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భవన నిర్మాణ రంగంలో వేల సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు వెల్ఫేర్ బోర్డులో పేరు నమోదు చేయించడం కోసం మీసేవ సెంటర్లకి కార్మికులు వెళ్తుంటే ఎక్కువ సమయం పడుతుందని సాకుతో ఆన్లైన్ నమోదు ప్రక్రియను చేయడం లేదు దీని మూలంగా ఎక్కువ మంది కార్మికులు నష్టపోతున్నారు ఇప్పటికీ చాలామంది కార్డ్ లబ్ధిదారుగా ఉన్నటువంటి కార్మికులు ప్రసూతి, వివాహలు ఆయన వాళ్ళు చాలామంది కార్మికులు ఉన్నారు.
ఆన్లైన్ సెంటర్లో ప్రక్రియను నమోదు చేయకపోవడం మూలంగా చాలామంది కార్మికులు లబ్ధిదారులు నష్టపోతున్నారు అదేవిధంగా జాబ్ కార్డుల నమోదు ప్రక్రియ కోసం కార్మికులు మీసేవ సెంటర్లకు వెళ్తుంటే అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు కావున ప్రతి మండల కేంద్రంలో ఆన్లైన్ సెంటర్ ను ఏర్పాటు చేసి అదనపు వసూలు చేస్తున్న మీసేవ సెంటర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కి వివరించడం జరిగింది కలెక్టర్ స్పందించి ఈ జిల్లాలో ఉన్న భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు ఇక ముందు నుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి మండల కేంద్రంలో ఉన్న మీ సేవలో ఈ ప్రక్రియను నమోదు అయ్యేలా కృషి చేస్తామని చెప్పారు అదేవిధంగా జిల్లాలో ఉన్న మీసేవ లో అదనపు చార్జీలు వసూలు చేస్తే మా దృష్టికి తీసుకురండి కచ్చితంగా వాటిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బాలకిషన్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పెరిక శ్రీకాంత్ పాల్గొన్నారు





