పెద్దపల్లి జనవరి 16:ముగ్గుల పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులు అందించిన యువ సంకల్ప ఫౌండేషన్.
ముగ్గుల పోటీలు అనగానే మహిళలందరినీ ఒక చోటుకు తీసుకువచ్చి వారికి నిర్ణీత సమయాన్ని ఇచ్చి ఆ సమయంలో పల్లె అందమైన రంగవల్లులు వేయాలంటూ ఒత్తిడి వాతావరణం లో పోటీలు నిర్వహిస్తారు. కానీ ఇక్కడ ఓ స్వచ్ఛంద సంస్థ వినూత్న రీతిలో ముగ్గుల పోటీలు నిర్వహించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఎవరి ఇంటి దగ్గర వారు వేసుకున్న ముగ్గులలో పోటీలు నిర్వహించే కొత్త సాంప్రదాయానికి తెర తీశారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్ కు ఓ ఆలోచన కలిగింది. ఈనెల 22న అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం ఉన్న సందర్భంగా, సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించాలని ఆలోచన తన మదిలో కదలడంతో ముగ్గుల పోటీలు నిర్వహించాలని తలచి యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న అతను తన సభ్యులతో చర్చించుకుని ముగ్గుల పోటీలను వినూత్న రీతిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఎలాంటి టెన్షన్ వాతావరణం లేకుండా ప్రశాంత వాతావరణంలో తన ఇంటి ముందు వేసిన ముగ్గును ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంటలోగా యువ సంకల్ప ఫౌండేషన్ వారి వాట్సాప్ నెంబర్ కు పంపించాల్సిందిగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కేవలం సుల్తానాబాద్ పట్టణానికి చెందిన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లుగా ముందస్తుగా తెలియజేశారు. ఒంటిగంట వరకు 87 మంది తమ పేర్లను తాము వేసిన ముగ్గులను వాట్సప్ ద్వారా అందజేశారు. కొంతమంది సుమారు 100 మందికి పైగా ఇతర ప్రాంతాల వారు కూడా పంపించడంతో వాటిని రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని ప్రతి వార్డు నుండి ఇందులో పాల్గొనడం జరిగింది. మొదటి స్థానాన్ని జవహర్ నగర్ కు చెందిన శెట్టి శివప్రియ సాయి ప్రియ గెలుచుకోగా ద్వితీయ బహుమతిని మెయిన్ రోడ్ సుంక స్వప్న గెలుచుకుంది తృతీయ బహుమతిని వివేకానంద కాలనీకి చెందిన కామణి వినోద కైవసం చేసుకుంది వీరితోపాటు పదిమంది మహిళలను ఎంపిక చేసి వారికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వినూత్న రీతిలో ఈ ముగ్గుల పోటీలో నిర్వహించిన నిర్వాహకులకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం స్థానిక శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో సమావేశం ఏర్పాటు చేసి నగదు బహుమతి.దాతలు మిట్టపల్లి ప్రవీణ్, కన్సిలేషన్ బహుమతులు దాతలు. అల్లం భాగ్యలక్ష్మి సత్యనారాయణ తుమ్మ రాజ్ కుమార్ ల చేయూతతో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతిగా 3000. రూపాయలు రెండవ బహుమతిగా 2000 రూపాయలు మూడో బహుమతిగా 1000 రూపాయలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్, సీనియర్ పాత్రికేయులు సామల హరికృష్ణ చిలకాని విశ్వనాథ్, ఫౌండేషన్ సభ్యులు కామిని రాజేంద్రప్రసాద్, తుమ్మా నిశాంత్, ఎనగందుల మల్లేశం, కొలిపాక రవీందర్. ఓదెలు, శెట్టి శ్రీనివాస్, శేఖర్ ,వెంకటేష్ మహిళలు అధికారులు ఉన్నారు.