కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరణకే వికసిత్ భారత్ సంకల్ప యాత్రలు
జనవరి 16
మెదక్ జిల్లా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రతిఒక్కరు కూడ అవగాహన కలిగివుండి వాటిద్వారా లబ్ధిపొందాలని లింగోజీగూడ సర్పంచ్ మెగావత్ రవి, అల్లీపూర్ సర్పంచ్ పిట్ల సుగుణ శ్రీనివాస్ అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పేద ప్రజలకోసం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజలకు వివరించేందుకు మండల ఇంచార్జి అశోక్ సాదుల ఆధ్వర్యంలో చేపడుతున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మండలంలోని అల్లీపూర్, లింగోజిగూడ గ్రామాలలో నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రభుత్వ అధికారుల ద్వారా గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది.
నర్సాపూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి మేనేజర్ నర్సయ్య, అసిస్టెంట్ మేనేజర్ సందీప్ కుమార్ ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన పథకాలకు మండలంలోని ప్రతి ఒక్కరూ కూడ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండల ఇంచార్జి అశోక్ సాదుల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన పథకం ద్వారా గ్రామాలలోని ప్రజలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ అందించడమే కాకుండా రైతుల సంక్షేమానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ఆర్థికంగా చేయూతనిస్తున్నారన్నారు.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా పేద ప్రజలందరికీ ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందజేయడం జరుగుతుందని పలు కేంద్ర పథకాలను వివరించారు. ఈకార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు మహిపాల్, ప్రమోద్ కుమార్, భారత్ గ్యాస్ ఏజెన్సీ హరికృష్ణ , ఏఎన్ఎం చిన్నలక్ష్మీ, ఆశా వర్కర్ అంజలి, నిర్మల సంకల్ప యాత్ర ప్రముఖులు నారాయణ, రమేష్, అంగన్వాడి శోభ, ఉప సర్పంచ్ దొంతి పోచమ్మలక్ష్మణ్,దస్రు నాయక్, వార్డ్ మెంబర్ చింతల మల్లయ్య, మొలుగు నర్సిములు, కొమీరేగారి లింగమయ్య అల్లీపూర్ చింతకాయల కుమార్, సాధు శంకర్, మహేష్, బైకని కుమార్, తదితరులు పాల్గొన్నారు.
