ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీల పాత్ర కీలకం
జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు
జనవరి 16
కొమురం భీం జిల్లా
ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమైనదని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు, ఆర్ డి ఓ సురేష్ లతో కలిసి గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా రూపకల్పన పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడంలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమైనదని అన్నారు. జిల్లాలో 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ వివరాలు నమోదు చేసుకునే విధంగా రాజకీయ పార్టీలు సహకరించాలని తెలిపారు.
ఓటరు జాబితాలో పేర్లు, చిరునామా ఇతర వివరాల మా సవరణ కొరకు బూత్ స్థాయి అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. మరణించిన వివరాలు జాబితా నుండి తొలగించేందుకు భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నోటీసుల ప్రక్రియ పూర్తి చేసి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలనికోరారు





