Breaking News

వస్తున్నాడు కెసిఆర్….

193 Views

వర్గల్ జనవరి 16 :వర్గల్ మండల్ బి ఆర్ ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం.

జనవరి 18న గజ్వేల్ శోభ గార్డెన్ లో
కెసిఆర్ భారీ మెజార్టీతో గెలిచిన శుభ సందర్బాన

బిఆర్ఎస్ పార్టీ కృతజ్ఞత సభ నిర్వహించడం జరుగుతుంది.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గజ్వేల్ శాసనసభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు భారీ మెజార్టీతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గజ్వేల్ నియోజకవర్గం నుండి గెలిచిన సందర్భం పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల అందరితో కలిసి కృతజ్ఞత సభ 18 జనవరి2024 గురువారం రోజున గజ్వేల్ లోని శోభ గార్డెన్ లో 10:00 గంటలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది .

ఈ కృతజ్ఞత సభకు అందరి అభిమాన నాయకులు తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.

కావున బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఎంపీపీ, జడ్పిటిసి, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, బూత్ కమిటీ ఇన్చార్జులు, సభ్యులు, కార్యకర్తలు హాజరై కృతజ్ఞత సభలో పాల్గొని విజయవంతం చేయగలరని పిలుపు.

వర్గల్ మండల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేలూరు వెంకట్ రెడ్డి తెలియజేయడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *