మంచిర్యాల పురపాలక సంఘం పారిశుధ్య కార్మికులు పట్టణమును పరిశుభ్రంగా ఉంచడంలో అలసత్వం వహించవద్దని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సూచించారు.
శనివారం మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో పారిశుధ్య కార్మికులకు సబ్బులు, నూనె అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పరిశుభ్రతలో మంచిర్యాల ను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలని అన్నారు. వార్డు సమస్యలను తెలుసుకోవడానికి పౌర సమాజ కమిటీలను వేస్తున్నట్లు తెలిపారు. ఆ కమిటీ సభ్యులు పారిశుధ్యం విషయంలో సంతృప్తి చెందితేనే కార్మికుల సమస్యలు పరిష్కరిస్థానని ఖరాఖండిగా చెప్పారు. సక్రమంగా విధులు నిర్వహిస్తే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో వేతనాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు.
కార్మికులకు యూనిఫామ్ తో పాటు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. పనిలో మాత్రం ఆశ్రద్దను సహించనని స్పష్టం చేశారు. ముక్యంగా ప్రజల సౌకర్యాలు, వ్యక్తిగత పనుల్లో అవినీతికి ఎవరు పాల్పడిన వారికి శత్రువు అవుతానని హెచ్చరించారు.
ఈకార్యక్రమంలో కాబోయే మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య, కాబోయే వైస్ ఛైర్మన్ సల్ల మహేష్, మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ కౌన్సిలర్ లు, కాంగ్రెస్ శ్రేణులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.






