చరితర్తుడు బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి పాపన్న గౌడ్
– సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన వేడుక
– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య
*రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం
బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి పాపన్న గౌడ్ అని బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం 373 వ జయంతి ఉత్సవాలను స్థానిక బస్టాండులో పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ లు పాల్గొనగా. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వేదికపై తోట ఆగయ్య మాట్లాడుతూ కడు పేదరికంతో బాధపడుతూ గోల్కొండ నవాబులపై సాయుధ పోరాటం చేసిన సర్దార్ పాపన్న అడుగుజాడల్లో నడువాలని సూచించారు. తనకంటూ సాయుధ బలగాలను ఏర్పాటు చేసుకుని బడుగు బలహీనవర్గాల ప్రజలను నవాబుల పాలన నుండి విముక్తి చేశారని పేర్కొన్నారు. మన పేదల పక్షపార్టీ అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాలకు దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాడని తెలిపారు. రాష్ట్రంలోని కళ్ళు గీతా కార్మికులకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన ముఖ్యమంత్రి అని ప్రశంసించారు. ప్రభుత్వమే పాపన్న ఉత్సవాలను గత సంవత్సరం నుంచి అధికారికంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గంట శ్రీనివాస్ గౌడ్, మండల గౌడ సంక్షేమ శాఖ అధ్యక్షులు గంట కార్తీక్ గౌడ్ జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి ఎంపీటీసీలు పందిర్ల నాగరాణి పరుశరామ్ గౌడ్, ఎలగందుల అనసూయ బి ఆర్ ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, ఎదురు గట్ల ముత్తయ్య గౌడ్. జిల్లా నాయకులు గంట వెంకటేష్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, గౌస్ మండల రెడ్డి సంఘం అధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి, శ్యామంతుల అనిల్ నర్సింలు, వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్ గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, గంట అంజా గౌడ్, నాగుల ప్రదీప్ గౌడ్, చింతకింది శ్రీనివాస్ గౌడ్, చెట్కూరి తిరుపతి గౌడ్, చింతకింది కిషన్ గౌడ్ గౌడ గ్రామస్తులుపాల్గొన్నారు.
