క్రీడలు

ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన భారత్

255 Views

అహ్మదాబాద్ నవంబర్ 19

ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన భారత్ విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు.

నేడు జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ ఫైనల్లో భారత్ జట్టు ఓటమిపాలైంది.

టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలతో ఊపు మీదున్న రోహిత్ సేన ఫైనల్‌ మ్యాచ్‌లో బోల్తా పడింది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

టీమిండియా సాధించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఆరోసారి విశ్వవిజేతగా  ఆస్ట్రేలియా క్రికెట్ టీం నిలిచింది. ట్రెవిస్‌ హెడ్‌ భారీ (120 బంతుల్లో 137) భారీ సెంచరీతో చెలరేగగా, మార్నస్‌ లబుషేన్‌ (58) అర్ధ సెంచరీతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

భారత బౌలర్లతో బుమ్రా 2 వికెట్లు తీయగా, షమీ ఒక వికెట్‌ పడగొట్టారు.

ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి సరిగ్గా 50 ఓవర్లలో కేవలం 240 పరుగులకే కుప్పకూలింది. కేఎల్‌ రాహుల్‌(66) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, విరాట్‌ కోహ్లీ (54), రోహిత్‌ శర్మ(47) పరుగులతో రాణించారు. గిల్‌ (4), శ్రేయస్‌ అయ్యర్‌ (4), రవీంద్ర జడేజా (9), సూర్య కుమార్‌ యాదవ్ (18), మహ్మద్‌ షమీ (6), జస్‌ ప్రీత్ బుమ్రా (1), కుల్‌ దీప్‌ యాదవ్‌ (10), మహ్మద్ సిరాజ్‌ (9) నిరాశపర్చారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌ 3 కీలక వికెట్లు తీయగా, హాజెల్‌ వుడ్, కమిన్స్‌ తలా 2 వికెట్లు తీశారు. మ్యాక్స్‌ వెల్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ట్రెవిస్ హెడ్ నిలిచాడు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *