జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
(తిమ్మాపూర్ జనవరి 11)
నర్సరీలలో పెంచే మొక్కలను ఫర్టిలైజర్ తో కాకుండా సంప్రదాయ పద్దతిలో పెంచాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
గురువారం తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలని లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వార నిర్వహిస్తున్న నర్సరీని, మహాత్మానగర్ లోని సంపద వనాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ, నర్సరీలలోని మొక్కల పెంపకాన్ని ఫెర్టిలైజర్ లతో కాకుండా సంప్రదాయ పద్ధతిలో జీవామృతం వంటి వాటిని వాడాలని సూచించారు. అదే విధంగా మొక్కలను ప్లాస్టిక్ బ్యాగులలో కాకుండా సీడ్ బాల్స్ లా తయారు చేసి పంపిణీ చేయాలని తెలిపారు. అనంతరం నర్సరీలలోని మొక్కలను పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీలత, తహసీల్దార్ కనకయ్య, ఎంపీడీఓ రవీందర్, ఎంపిఓ కిరణ్ కుమార్, ఏపీఓ లలిత, ఈసి రాజు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.