-ఆకట్టుకున్న వేషదారణలు
(తిమ్మాపూర్ జనవరి 10 )
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలో సంక్రాంతి సంబురాలు బుధవారం అట్టహాసంగా జరిపారు. చిన్నారులు వివిధ వేషదారణల్లో అలరించారు. పల్లె వాతావరణం ఉట్టిపడేలా ప్రదర్శనలు చేశారు. సంక్రాంతి గొబ్బెమలు, ముగ్గుల పోటీలు, సకినాల వంటలు, హరిదాసు ఆటలు ఆకట్టుకున్నాయి. బోగిపండ్లతో చిన్నారులను ఆశీర్వదించారు. సంస్కృతీ సంప్రదాయాలు చిన్నారులకు అవగాహన తెచ్చేందుకు వేడుకలు ఘనంగా నిర్వహించినట్టు ప్రిన్సిపల్ విమల పేర్కొన్నారు. వేడుకల్లో టీచర్లు రజిత, అన్నపూర్ణ, సంగీత, శ్రీలేఖ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




