మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు. కొన్ని అనివార్య కారణాలవల్ల తన పదవికి రాజీనామా చేసినట్లుగా ముఖేష్ గౌడ్ పేర్కొన్నారు.
ఇప్పటివరకు తనకు సహకరించిన మాజీ శాసనసభ్యులకు, పాలకవర్గానికి, మున్సిపల్ అధికారుల మరియు పత్రిక మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
